గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు. శ్వేత మహంతి ఇవాళ తన క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం ప్రతి జిల్లా అధికారి వారి కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.