బిగ్ బాస్ సీజన్ 3లోకి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బుల్లితెర యాంకర్ శివజ్యోతి. తీన్మార్ సావిత్రిగా తన యాసతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ ఇంట్లోను సందడి చేసింది. దాదాపు 98 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండి ఇటు ప్రేక్షకులకి అటు కంటెస్టెంట్స్‌కి మంచి వినోదాన్ని అందించింది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సమయంలోనే తనకి సొంతింటి కల ఉందని, అది త్వరలోనే నెరవేర్చుకుంటానని చెప్పిన శివజ్యోతి మంగళవారం తన భర్త గంగూలీతో కలిసి ఖరీదైన ఇంట్లోకి అడుగుపెట్టింది . ఘనంగా గృహప్రవేశ వేడుకని జరుపగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ హజ్‌మేట్స్ హాజరయ్యారు. రవిక్రిష్ణ, అలీ రెజాలతో పాటు హిమజ, వితిక, వరుణ్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లు ఈ వేడుకలో సందడి చేశారు. గృహప్రవేశ వేడుకకి సంబంధించిన ఫోటోలని హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా సొంతింటి కలని నిజం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పాపులారిటీతో పాటు ఆర్ధికంగా బలపడుతున్నారు. కొందరు సొంతింటి కలని నెరవేర్చుకుంటున్నారు.
కొత్త ఇంట్లోకి బిగ్ బాస్ లేడీ.. రచ్చ చేసిన తోటి సభ్యులు