హెచ్‌సీయూ విద్యార్థికి ఆస్ట్రేలియా అవార్డు..

 హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్ సీ యూ) విద్యార్థి.. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ (ఏ ఎన్‌యూ) అందజేసే ఫ్యూచర్‌ రీసెర్చ్‌ టాలెంట్‌ (ఎఫ్‌ఆర్‌టీ) -2020 అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని  వర్సిటీ పీఆర్‌ఓ ఆశీష్‌ జెకాబ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని సిస్టమ్స్‌ బయోలజీ విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ ప్రో గ్రామ్‌లో నాల్గవ సంవత్సరం చదువుతున్న అనన్య దాస్ ఏఎన్‌యూ యూనివర్సిటీ అందజేసే ఎఫ్‌ఆర్‌ టీ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థినికి అవార్డు రావడం పట్ల యూనివర్సటీ మొత్తం హర్షం వ్యక్తం చేసినట్లు పీఆర్ ఓ ఆశీష్ వెల్లడించారు.