మీ మాట‌లు మార్గ నిర్దేశం చేస్తాయి: నాగార్జున‌

ఎట్ట‌కేల‌కి మెగాస్టార్ చిరంజీవి ఉగాది సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌ని చిరంజీవి వాడుతుండ‌గా, ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తొలి పోస్ట్‌గా  కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం అని పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా క‌రోనాని త‌రిమికొట్టాలంటే ఏం చేయాలో కూడా వివ‌రించారు.


చిరంజీవి సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నేప‌థ్యంలో నాగార్జున, వినాయ‌క్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు చిరుకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిరుకి గ్రాండ్ వెల‌కమ్ చెబుతూ..  ఇప్పుడు మీ మాటలు ఈ కష్ట సమయాల్లో ఉన్న‌ చాలా మందికి మార్గనిర్దేశం చేస్తాయి! ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని స్ప‌ష్టం చేశారు. ఇక వివి వినాయ‌క్  వెల్‌క‌మ్ బాస్ అంటూ స్వాగ‌తం ప‌లికారు.