సిరిసిల్లలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. మృతివార్త తెలిసిన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆర్థికసాయంతో పాటు హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ విధుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నాడు. బుధవారం పెట్రోల్ విధుల్లో ఉండగా సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌరస్తాలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. వడదెబ్బ తగిలి మృతిచెందినట్లుగా పేర్కొన్నారు.